మందారిపేటలో తంగేడు మొక్కలు నాటిన ఎమ్మె ల్యే

ప్రతి ఇంటా తంగేడు మొక్క నాటాలి: గండ్ర సత్యనారాయణరావు
శాయంపేట మండలo మందారిపేట గ్రామంలో ప్రారంభమైన తంగేడు మొక్కల పెంపక ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా విస్త రించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు ఆకాంక్షిం చారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తంగేడు మొక్కను నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తంగేడు తెలంగాణ రాష్ట్ర పుష్పమని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లకు తంగేడు పుష్పం ప్రత్యేక గుర్తింపుగా నిలు స్తుందని అన్నారు. బతు కమ్మ పండుగతో తంగేడు పుష్పానికి విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు.మొదలైన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాలి. ప్రారంభమైన తంగేడు మొక్కల పెంపక కార్యక్రమం స్ఫూర్తిగా నిల వాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఇంటిలో ఒక్క తంగేడు మొక్కను నాటి సంరక్షిం చాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, రహదారుల వెంట, చెరువు కట్టలు, ప్రభుత్వ స్థలాల్లో తంగేడు మొక్కలను విస్తృతంగా నాటాలని సూచించారు. తెలంగాణ అంతటా తంగేడు మొక్కల పెంపకం జరిగేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.తంగేడు మొక్కల పెంపక ఉద్యమాన్ని చేపట్టి గ్రామస్థులు, యువతలో అవగాహన కల్పిస్తున్న ఉద్యమ అధ్యక్షుడు బడుగు సునీల్ ను ఎమ్మె ల్యే అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసర మని అన్నారు. ఈ
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన, కార్యదర్శి అజయ్, ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్, కుక్కల తిరుపతి, మాజీ మార్కెట్ ఛైర్మన్ రేణుకుంట్ల సదయ్య, బూర ఈశ్వర య్య, బొట్టు రత్నాకర్, వలుస తరుణ్, గాజర్ల శంకర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యా యులు, యువకులు, తంగేడు మొక్కల కమిటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
