మంగళవారం, 13 అక్టోబర్ 2026
తెలంగాణ గవాక్షం
బ్రేకింగ్
తెలంగాణలో తాజా వార్తలు, ముఖ్యమైన పరిణామాలు...
తెలంగాణవరంగల్

లారీ బీభత్సం.. జవాన్ మృతి

షేర్ చేయండి:FacebookTelegramX (Twitter)
లారీ బీభత్సం.. జవాన్ మృతి

పస్రా–తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

సీఆర్పీఎఫ్ వాహనం, కారును ఢీకొన్న ఇసుక లారీ.. పలువురికి తీవ్ర గాయాలు

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా–తాడ్వాయి మధ్య చెక్‌పోస్ట్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఇసుక లారీ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన వాహనంతో పాటు మరో కారును ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

లారీ ఢీకొనడంతో కారు లారీ కింద ఇరుక్కుపోయింది. సీఆర్పీఎఫ్ వాహనం కంటెయినర్ వెనుక భాగం ధ్వంసమై ఊడిపడింది. ప్రమాద తీవ్రతతో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు సహాయక చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్సుల ద్వారా ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా 163వ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరిస్తూ రాకపోకలను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.