మంగళవారం, 13 అక్టోబర్ 2026
తెలంగాణ గవాక్షం
బ్రేకింగ్
తెలంగాణలో తాజా వార్తలు, ముఖ్యమైన పరిణామాలు...
తెలంగాణమహబూబ్‌నగర్

ప్రభుత్వాన్ని నిలదీసినందుకే రైతులపై వేధింపులా? మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

షేర్ చేయండి:FacebookTelegramX (Twitter)
ప్రభుత్వాన్ని నిలదీసినందుకే రైతులపై వేధింపులా? మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

14 మంది రైతులపై నాన్‌-బెయిలబుల్ కేసులు

గవాక్షం మక్తల్ ప్రతినిధి : సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ జూరాల డ్యామ్‌ వద్ద గత నెల ధర్నాకు దిగిన రైతులపై పోలీసులు నాన్‌-బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు సాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనకు సంబంధించిన వ్యవహారంపై 14 మంది రైతులపై పోలీసులు నాన్‌-బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా ఆందోళన చేస్తే కేసులు నమోదు చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల సమస్యలపై ఆందోళనకు దిగిన 14 మంది రైతులపై నాన్‌-బెయిలబుల్ కేసులు నమోదు చేయడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. పంటలకు సరైన ధర, కొనుగోళ్లలో ఇబ్బందులు, రైతుల సమస్యలపై ప్రశ్నించిన రైతులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న రైతన్న తన సమస్యను చెప్పుకునేందుకు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తే.. వారి గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయించడం దారుణమని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారిపై పోలీసు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులపై ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా, వారి సమస్యలను చర్చించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల హక్కుల కోసం బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందని, అవసరమైతే రైతుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు