శనివారం, 28 నవంబర్ 2026
తెలంగాణ గవాక్షం
బ్రేకింగ్
తెలంగాణలో తాజా వార్తలు, ముఖ్యమైన పరిణామాలు...
తెలంగాణవరంగల్

గ్రాడ్యుయేట్ల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి

షేర్ చేయండి:FacebookTelegramX (Twitter)
గ్రాడ్యుయేట్ల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ శాయంపేట మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మండలంలోని మందారిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులను వ్యక్తిగతంగా కలిసి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి విజయానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. పట్టభద్రులు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలు, విద్యారంగ సమస్యలు, ఇతర సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించి పరిష్కారానికి కృషి చేసే నాయకుడు సర్వోత్తమ రెడ్డి అని బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన కాంగ్రెస్ అభ్యర్థికి పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకోని అర్హులైన పట్టభద్రులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారపెల్లి రవీందర్, చిందం రవి, నిమ్మల రమేష్, కుక్కల తిరుపతి, రావుల శ్రీనివాస్, కొమ్ముల భాస్కర్, పైడి, తక్కళ్ల సాంబయ్య, కొమ్ముల విష్ణు, బడుగు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

గ్రాడ్యుయేట్ల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి - అదనపు ఫొటో